ఈ ఐడియాలు ఎలా వస్తున్నాయి రా : ఆస్పత్రిలోకి వచ్చి.. లిఫ్ట్ నుంచి వెళుతూ డాక్టర్ చైన్ లాక్కెళ్లిన కేటుగాడు

ఈ ఐడియాలు ఎలా వస్తున్నాయి రా : ఆస్పత్రిలోకి వచ్చి.. లిఫ్ట్ నుంచి వెళుతూ డాక్టర్ చైన్ లాక్కెళ్లిన కేటుగాడు

అక్కడా.. ఇక్కడా లాభం లేదు అనుకున్నాడు.. రోడ్డుపైన అయితే వర్కవుతుందో లేదో అనే ఆలోచనతో.. కొత్త చైన్ స్నాచింగ్ ఐడియా ఆలోచించాడు ఆ కేటుగాడు. ఎంచక్కా పెద్ద ఆస్పత్రికే వచ్చాడు.. పేషెంట్ కోసం వచ్చినట్లు నటిస్తూ.. లిఫ్టులో పైకి కిందకు తిరుగుతున్నాడు. అదే సమయంలో ఓ డాక్టర్.. లిఫ్ట్ ఎక్కింది. ఈ కేటుగాడు అదే లిఫ్ట్ లో ఉన్నాడు. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో దిగే సమయంలో.. మిగతా ఎవరూ లేకపోవటంతో.. ఆ డాక్టర్ మెడలోని బంగారం చైన్ లాక్కుని పరుగో పరుగు పెట్టాడు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరగలేదు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ సిటీ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది. ఈ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ లిఫ్ట్ లో వెళ్తుండగా.. చైన్ లాక్కొని పరిగెత్తాడు ఓ కేటుగాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మొదట మహిళా డాక్టర్ లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యింది.. ఆ తర్వాత వచ్చిన కేటుగాడు ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాతి ఫ్లోర్ దగ్గర లిఫ్ట్ ఆగగానే డాక్టర్ దిగేందుకు ముందుకు వచ్చింది.. ఈ క్రమంలో డాక్టర్ కంటే ముందుగా బయటికి వెళ్లిన కేటుగాడు ఆమె మేడలో చైన్ లాక్కొని పరిగెత్తాడు. అతన్ని వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించింది డాక్టర్. 

ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియో కింద రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో పబ్లిక్ గా చైన్ స్న్యాచింగ్ జరిగిందంటే.. ప్రభుత్వ వ్యవస్థల్లో డొల్లతనానికి నిదర్శనం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.ఎయిమ్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో లిఫ్ట్ లో గార్డ్స్ ఉండాలన్న కనీస నిబంధన ఫాలో అవ్వకపోవడం సిగ్గుచేటని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

అయితే.. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో చైన్ స్న్యాచింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని.. బయటికి వెళ్ళేటప్పుడు గోల్డ్ ధరించకపోవడమే మంచిందని అంటున్నారు నెటిజన్స్. అవసరమైతే.. రోల్డ్ గోల్డ్ ధరించాలని.. ఒంటరిగా బయటికి వెళ్ళటం కూడా ప్రమాదమేనని అంటున్నారు.