కేరళ బస్సు వీడియో కేసులో అరెస్టైన షింజితా ముస్తఫాకు బెయిల్ నిరాకరించింది కోర్టు. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే.. అది సమాజానికి తప్పుడు సంకేతం అవుతుందని పేర్కొన్నారు కేరళ పోలీసులు. కన్నుమంగళం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు మెడికల్ కాలేజీ పోలీసులు. షింజితాకు బెయిల్ ఇస్తే.. ఇలాంటి ఘటనలను ప్రోత్సహించినట్లు అవుతుందని.. మరిన్ని ఆత్మహత్యలకు దారి తీయచ్చని అన్నారు పోలీసులు.
షింజితా బెయిల్ పై విడుదలైతే, ఇలాంటి ఘటనలు రిపీట్ అయ్యే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. దర్యాప్తును అడ్డుకునే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు పోలీసులు. పోలీసుల వాదనను అంగీకరించిన కోర్టు, జనవరి 22న మంజేరి జైలులో శింజితను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
జనవరి 16న కేరళ కేరళలోని కోజికోడ్, గోవిందపురంకు చెందిన దీపక్ అనే వ్యక్తి బస్సులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఇన్ఫ్లూయెన్సర్ షింజితా ముస్తఫా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అలాంటి వాడిని కాదని.. ఈ అవమానాన్ని తట్టుకోలేనంటూ ప్రాణాలు తీసుకున్నాడు.
ALSO READ : 30 ఏళ్ల కెరీర్, 33 కోట్ల ఆస్తి.. చివరకు ఒంటరివాడినయ్యా: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మనోవేదన
మృతుడి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు దీపక్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలపై ముస్తఫాపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దీపక్ ఆత్మహత్య కేసులో బుధవారం (జనవరి 21) షింజితా ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను మంగళం మేజిస్ట్రేట్ ముందు పర్చగా ముస్తాఫాకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
