రేపటి నుంచే( జనవరి 28) మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు : ఫిబ్రవరి 11న పోలింగ్.. 13న కౌంటింగ్

 రేపటి నుంచే( జనవరి 28) మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు : ఫిబ్రవరి 11న పోలింగ్.. 13న కౌంటింగ్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.  2026, ఫిబ్రవరి 11వ తేదీ ఓటింగ్ జరగనుంది. 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. 

 2026, జనవరి 28వ తేదీ బుధవారం నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది.116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 52 లక్షల 43 వేల మంది ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఎన్నికల కీలక  వివరాలు

  •  జనవరి 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
  • జనవరి 30 వరకు నామినేషన్ల చివరి తేదీ
  • జనవరి 31న నామినేషన్ల పరిశీలన
  • ఫిబ్రవరి 1న నామినేషన్ల స్ట్రూటినీపై అభ్యంతరాల స్వీకరణ
  • ఫిబ్రవరి 2న అభ్యంతరాలపై తుది నిర్ణయం
  • ఫిబ్రవరి 3న నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం
  • ఫిబ్రవరి 3న పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ప్రకటన
  • ఫిబ్రవరి 3వ తేదీ ఫైనల్ అభ్యర్థుల ప్రకటన
  • ఫిబ్రవరి 11వ పోలింగ్.. 
  • ఫిబ్రవరి13న కౌంటింగ్
  • ఫిబ్రవరి 16 మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీల్లో  చైర్ పర్సన్ల ఎన్నిక