భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్ కెనడా: ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చినా తగ్గని క్రేజ్.. ఎందుకంటే..?

భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్ కెనడా: ఇమ్మిగ్రేషన్ రూల్స్ మార్చినా తగ్గని క్రేజ్.. ఎందుకంటే..?

కెనడాలో ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతున్నప్పటికీ.. ఇండియన్ విద్యార్థులకు ఆ దేశం పట్ల ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2026 లెక్కల ప్రకారం సుమారు 4లక్షల 27వేల మందికి పైగా కొత్త ఇండియన్ స్టూడెంట్స్ కెనడాలోని వివిధ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్న తరుణంలో కూడా కెనడా నంబర్ వన్ డెస్టినేషన్ గా మారటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం అక్కడ విద్యార్థులకు లభిస్తున్న అపారమైన అవకాశాలు, సరళతరమైన నిబంధనలేనని నిపుణులు అంటున్నారు.

భారతీయ విద్యార్థులు కెనడాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడి పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్. చదువు పూర్తయిన తర్వాత విద్యార్థులు అక్కడ నివసించడానికి, వర్క్ ఎక్స్‌పీరియెన్స్ సంపాదించడానికి ఈ పర్మిట్ ఎంతో అండగా నిలుస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాలో వర్క్ పర్మిట్ పొందడం.. ఆ తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవడం సులభంగా ఉండటంతో విద్యార్థులు ఇక్కడికే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా కెనడా ప్రభుత్వం డిజిటల్ విధానాలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా డ్యుయోలింగో ఇంగ్లీష్ టెస్ట్ వంటి డిజిటల్ సర్టిఫికేషన్లను అంగీకరించడం విద్యార్థులకు వరంగా మారింది.

కెనడాలోని యూనివర్సిటీలు కేవలం థియరీకే పరిమితం కాకుండా.. ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందిస్తున్నాయి. ఐటీ, మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్, ఇంజనీరింగ్ విభాగాల్లో భారతీయ విద్యార్థులకు అక్కడ భారీ డిమాండ్ ఉంది. అలాగే కెనడాలో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా వెళ్లే విద్యార్థులకు హోమ్లీ ఫీలింగ్ కలుగుతుంది. ఇది వారి భద్రత, సామాజిక జీవనంపై సానుకూల ప్రభావం చూపుతోంది.

ALSO READ : యూరప్ దేశాలతో కుదిరిన 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఇండియాలో రేట్లు తగ్గే వస్తువులు ఇవే..

ఇటీవలి కాలంలో కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ క్యాప్స్ విధించినప్పటికీ.. ప్రతిభ ఉన్న విద్యార్థులకు మాత్రం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటున్నాయి. క్వాలిటీ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న డిగ్రీలు, చదువుతో పాటే పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసుకునే సౌకర్యాలు ఉండటం కెనడాను భారతీయ మధ్యతరగతి విద్యార్థుల కలల డెస్టినేషన్ గా మార్చేశాయి. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా కెనడా తన విద్యా వ్యవస్థను ఆధునీకరించడం వల్ల 2026లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతోందని చెప్పుకోవచ్చు.