ప్రత్యేక అధికారుల నియామకంపై స్టేకు హైకోర్టు నిరాకరణ

ప్రత్యేక అధికారుల నియామకంపై స్టేకు హైకోర్టు నిరాకరణ

ఇవాళ్టితో తమ పదవి కాలం ముగియడంతో  సర్పంచ్ లు హైకోర్టులో పిటిషన్ వేశారు. గ్రామాల్లో  ప్రత్యేక అధికారులను నియమించకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని  పిటిషన్ లో కోరారు సర్పంచ్ లు.  ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవి కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పిటిషన్ ను  విచారించిన హైకోర్టు.. ప్రత్యేక అధికారుల నియామకంపై స్టేకు నిరాకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

సర్పంచుల పదవీకాలం మరి కొన్ని గంటల్లో ముగియనుంది. గ్రామాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది.  ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లనే నియమించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది.

సమీపంలో లోక్ సభ ఎన్నికలు ఉండటం ఇతరత్రా కారణాల రీత్యా ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లుగా ఎవరిని నియమించాలనే దానిపై  జాబితా సిద్దం చేయాలని అధికారులను  సీఎం ఆదేశించారు.