మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ పిటిషన్పై విచారించనున్న హైకోర్టు

మాదాపూర్ డ్రగ్స్ కేసు.. నవదీప్ పిటిషన్పై విచారించనున్న హైకోర్టు


మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ వేసిన పిటీషన్పై సెప్టెంబర్ 19వ తేదీన హైకోర్టు విచారించనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఉన్నాడంటూ పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో..ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశివ్వాలని కోరుతూ సెప్టెంబర్ 15వ తేదీన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు  నవదీప్. దీంతో నవదీప్ వేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 19వ తేదీ వరకు  నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని పోలీసులను  ఆదేశించింది. అయితే సెప్టెంబర్ 19న నవదీప్ పిటీషన్పై హైకోర్టు విచారణ జరపనుంది. 

ALSO READ: బిచ్చగాడు హీరో కుమార్తె ఆత్మహత్య

మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్ పేరు తెర మీదికి వచ్చింది. ఈ కేసులో హీరో  నవదీప్‌ ఉన్నాడంటూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ తన స్నేహితుడు రామ్ చంద్‌తో కలిసి డ్రగ్స్ కొన్నట్టు తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌ను కన్జ్యూమర్స్ లిస్టులో ఉన్నారని.ఆయన్ను 29వ నిందితునిగా చేర్చినట్లు పేర్కొన్నాడు. . నవదీప్ పరారీలో ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ తో పాటు..మరో 17 మంది కూడా పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. 

సీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యలపై హీరో నవదీప్  స్పందించాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ తెలిపారు. అయితే ఈ కేసులో పోలీసుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు.