
హైదరాబాద్, వెలుగు: సున్నా మార్కులు వచ్చిన ఆన్సర్షీట్లు, అసలు దిద్దని పేపర్లను రీవెరిఫై మాత్రమే చేశామని, మళ్లీ దిద్దలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్బాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి దిద్దిన పేపర్లను మళ్లీ దిద్దడం కుదరదని, విద్యార్థులు, తల్లిదండ్రులు దీన్ని గమనించాలని చెప్పారు. మొత్తం మార్కులను సరిచేశామన్నారు.
మ్యాథ్స్ విద్యార్థులూ.. టెన్షన్ వద్దు
ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు లెక్కల పరీక్షలో 75 మార్కుల ప్రశ్నపత్రాన్ని ఇస్తామని, పాస్ మార్కులు 26 అని అశోక్బాబు చెప్పారు. ఎంఈసీ విద్యార్థులు 75 మార్కులకే పరీక్ష రాసినా, మెమోలో ఆ మార్కులను 50 శాతానికి తగ్గించి ప్రింట్ చేస్తామన్నారు. అసలు మార్కులను 2/3తో లెక్కించి మార్కులేస్తామన్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి 75 మార్కులకు 18 వస్తే.. ఆ వచ్చిన మార్కులను 18 x 2/3 =12గా లెక్కిస్తామన్నారు. కాబట్టి పేపర్లో వచ్చిన మార్కులు, మెమోలో ప్రింటైన మార్కులను చూసి ఆందోళన చెందొద్దని సూచించారు. రీవెరిఫికేషన్లో పాసైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్ష కోసం సబ్జెక్టుకు ₹150 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేపర్లను రీవాల్యుయేషన్ చేస్తే మరింత మంది పాసై
ఉండేవారని తల్లిదండ్రుల సంఘం పేర్కొంది. అసలు సమస్యను అశోక్బాబు విస్మరించారని పేర్కొంది.