డ్రగ్స్‌ కట్టడికి కొత్త వ్యూహాలు.. ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీలపై ప్రత్యేక నిఘా: సందీప్ శాండిల్యా

డ్రగ్స్‌ కట్టడికి కొత్త వ్యూహాలు..  ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీలపై ప్రత్యేక  నిఘా: సందీప్ శాండిల్యా

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్‌ కట్టడికి కొత్త వ్యూహాలు రచించామని అన్నారు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా . డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేస్తున్నామని.. ఇకనుంచి ఐటీ,  ఫిల్మ్‌ ఇండస్ట్రీలు, విద్యాసంస్థలు, బార్లు, పబ్‌, రిసార్ట్స్‌, రేవ్ పార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో డ్రగ్స్ నిర్మూలనపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ న్యాబ్ వ్యవస్థ, పనితీరుపై డైరెక్టర్ సందీప్ శాండిల్యా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.

ప్రెస్ నోట్ లో కీలక పాయింట్స్:

  •  తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేయడమే లక్ష్యంగా టిఎస్‌ న్యాబ్ పనిచేస్తుంది.
  • డ్రగ్స్ కట్టడికి చేసిన కృషి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించాం.
  • టిఎస్‌ న్యాబ్ వ్యవస్థ, డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంతో దాదాపు రెండు గంటలు చర్చించాం.
  • టిఎస్‌ న్యాబ్ గ్రేహౌండ్స్, అక్టోపస్ తరహా సంస్థలా మారాలి
  • విద్యాసంస్థలు, సినీ, ఐటీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై నిరంతరం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం
  • బార్స్, పబ్స్, రేవ్ పార్టీలు, రిసార్టులలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం
  • ఉత్తమ పనితీరు కనబర్చిన అధికారులకు ప్రోత్సాకాలు అందిస్తామని  ప్రభుత్వం హామీ ఇచ్చింది
  • త్వరలో డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ని అందుబాటులోకి తీసుకొస్తాం
  • ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ లాగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తీసుకొస్తాం
  • పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు చూడాలి.
  • డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి.
  • డ్రగ్స్ సరఫరాపై 8712671111 నెంబర్ కు  సమాచారం ఇవ్వొచ్చు.
  • విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను బలోపేతం చేస్తాం