టెన్త్ ​ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధం

టెన్త్ ​ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధం


హైదరాబాద్/వికారాబాద్, వెలుగు : హైదరాబాద్, మేడ్చల్– మల్కాజ్​గిరి, రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లో అధికారులు పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 921 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి 1,88,779 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాయనున్నారు. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు, పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. హాల్​టికెట్లు అందనివారు www.bse.telangana.gov.in ద్వారా ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30వరకు ఎగ్జామ్స్​జరగనుండగా, 5 నిమిషాల గ్రేస్​ పిరియడ్​ ఇచ్చారు. 9:35 వరకు విద్యార్థులను ఎగ్జామ్​హాల్​లోకి అనుమతిస్తారు.