నేడు( సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నేడు( సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం జరగనున్నది. ఉదయం, మధ్యాహ్నం  రెండు పూటలా పరీక్షలు  కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పేపర్ 2 పరీక్ష ఉంటుంది. అయితే టెట్ ఎగ్జామ్​కు నిమిషం నిబంధన అమల్లో ఉందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నిమిషం లేటైనా లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలని సూచించారు. టెట్ పేపర్1కు 1139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 2,69,557 మంది ఎగ్జామ్ రాయనున్నారు. పేపర్​ 2 ఎగ్జామ్​కు 913 పరీక్షా కేంద్రాల్లో 2,08,498 మంది హాజరుకానున్నారు. అయితే, బీఈడీ చేసిన వారికి ఎస్జీటీ పోస్టులకు అవకాశం లేకపోవడంతో  పేపర్​ 1కు భారీగా అటెండెన్స్ తగ్గే అవకాశముంది.