- కేశవరావుకు టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న కొత్త విద్యా విధానంలో టీసాట్నూ భాగస్వామి చేయాలని విద్యాపాలసీ కమిషన్ చైర్మన్ కె. కేశవరావును టీసాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి కోరారు. గురువారం కేశవరావును ఆయన నివాసంలో కలిసి టీసాట్ఎడ్యుకేషన్ పాలసీ డాక్యుమెంట్‌ను అందజేశారు.
ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ స్థాయి విద్య, పోటీ పరీక్షల కంటెంట్ ను అందించి దేశంలోనే డిజిటల్ విద్యా చానెళ్లలో టీసాట్ ముందు వరుసలో ఉందని వేణుగోపాల్ గుర్తుచేశారు. టీసాట్ చానెళ్లు, యాప్, ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉందని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం రూపొందించబోయే నూతన ఎడ్యుకేషన్ పాలసీతోనూ రాష్ట్ర ప్రజలకు డిజిటల్ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సీఈవో అందచేసిన డాక్యుమెంట్ ను పరిశీలించిన కేశవ రావు సంతృప్తి వ్యక్తం చేశారు.
వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, యువత, వృద్ధులు, మహిళలలతో పాటు ఇతర రంగాలకు అందిస్తున్న డిజిటల్ సేవలను ఆయన కొనియాడారు. కొత్త విద్యావిధానం తయారీలో టీసాట్ సేవలను వాడుకుంటామని హామీ ఇచ్చారు.
