సంగారెడ్డి టౌన్, వెలుగు: రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని టీజీ ఐఐసీ చైర్పర్సన్నిర్మల జగ్గారెడ్డి సూచించారు. గురువారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలు చాలా విలువైనవని, నిర్లక్ష్యంతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ నిబంధనలను క్రమశిక్షణతో పాటిస్తే ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చన్నారు.
