టీఎస్ పీఈ-సెట్ 2021 ఫలితాలు విడుదల

టీఎస్ పీఈ-సెట్ 2021 ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ విద్య ప్రవేశ పరీక్ష (టీఎస్ పీఈ-సెట్ 2021) ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. గత అక్టోబర్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 14 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3 వేల 133 మంది హాజరుకాగా వారిలో 1787 మంది బీపీఈడీకి అర్హత సాధించారు. అలాగే డీపీఈడీకి 1207 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ప్రొఫెసర్ లింబాద్రి వివరించారు. 
బీపీఈడీలో ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణవేణి మొదటి ర్యాంకు సాధించగా.. డీపీఈడీలో భూపాలపల్లికి చెందిన సృజన్ మొదటి ర్యాంకు సాధించారు.