
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.03 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికిపైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లలో ఎడిట్ అప్షన్ కు అవకాశం కల్పించారు.
ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్ పీఎస్సీ 563 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు.