TSPSC: గ్రూప్ 2 పరీక్ష తేదీల ప్రకటన

TSPSC: గ్రూప్ 2 పరీక్ష తేదీల ప్రకటన

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష తేదీలను టీఎస్‭పీఎస్సీ ప్రకటించింది. ఆగష్టు 29, 30 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. మొత్తం 783 పోస్టులకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా.. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరీక్షకు వారం రోజుల ముందే హాల్ టికెట్లను టీఎస్‭పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా.. చివరి మూడు రోజుల్లోనూ ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.