అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ నోటిఫికేషన్ రద్దు 

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ నోటిఫికేషన్ రద్దు 
  • ఈ నెల 22 నుంచి అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ 
  • అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ నోటిఫికేషన్ రద్దు 

హైదరాబాద్, వెలుగు: వివిధ డిపార్ట్ మెంట్లలో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 14 దాకా దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఈనెల 15న పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఇస్తామని.. అందులో అన్ని వివరాలుంటాయని, దాన్ని వెబ్ సైట్​లో పెడతామని చెప్పింది. శనివారం టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్​రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లోని ఏఈఈ పోస్టుల భర్తీపై చర్చించి 1,540 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేశా రు. ఇందులో మిషన్ భగీరథ (సివిల్)లో 302 పోస్టులు, పీఆర్ అండ్ ఆర్డీలో 211, ఎంఏ అండ్ యూడీ– పీహెచ్​లో 147, టీడబ్ల్యూలో 15, ఐ అండ్ సీఏడీలో 704, సీ అండ్ సీఏడీ (మెకానికల్)లో 3, టీఆర్ అండ్ బీ (సివిల్)​లో 145, టీఆర్ అండ్ బీలో 13 పోస్టులు ఉన్నాయి. ఐ అండ్ సీఏడీలోని 704 పోస్టుల్లో సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ లో 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్​లో 100  పోస్టులున్నట్టు నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. 

ఏఎంవీఐ నోటిఫికేషన్ రద్దు 

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్​ను రద్దు చేస్తున్నట్టు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ అనితా రాంచంద్రన్ ప్రకటించారు. రవాణా శాఖలో 113 పోస్టుల భర్తీకి జులై నెలాఖరులో టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసే టైమ్​కు చాలామంది అభ్యర్థులకు హెవీ మో టార్ వెహికల్ లైసెన్స్ లేదని టీఎస్ పీఎస్సీకి వినతులొచ్చాయి. నోటిఫికేషన్ రద్దు చేసి, రవాణా శాఖ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. ఆ శాఖ నిర్ణయం వచ్చాక కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.