టీఎస్​పీఎస్సీ పరీక్షల సెప్టెంబర్​ షెడ్యూల్

టీఎస్​పీఎస్సీ పరీక్షల సెప్టెంబర్​ షెడ్యూల్

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్‌‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌‌ను టీఎస్​పీఎస్సీ శనివారం విడుదల చేసింది.ఈ షెడ్యూల్‌‌ ప్రకారం.. ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో లెక్చరర్‌‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను  4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌‌పీఎస్సీ నిర్వహించనుంది. 

ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీల్లోని ఫిజికల్‌‌ డైరెక్టర్‌‌ పోస్టులకు సంబంధించి 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్‌‌ కాలేజీల లెక్చరర్‌‌ పోస్టుల భర్తీ కోసం  12, 13, 14, 20, 21, 22, 25, 26, 27,29వ తేదీల్లో పరీక్షలు జరపాలని టీఎస్‌‌పీఎస్సీ నిర్ణయించింది.