
గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 8 క్వశ్చన్లకు సరైన ఆన్సర్లు గుర్తించినా, గుర్తించకపోయినా అందరికీ మార్కులు కలపనున్నారు. రెండు ప్రశ్నల ఆన్సర్లను కూడా కమిషన్ సవరించింది.
గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫైనల్ కీని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు 8 ప్రశ్నలను డిలీట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ 8 క్వశ్చన్లకు సరైన ఆన్సర్లు గుర్తించినా, గుర్తించకపోయినా అందరికీ మార్కులు కలపనున్నారు. ఇంకో 2 ప్రశ్నల ఆన్సర్లను కూడా కమిషన్ సవరించింది. ప్రిలిమినరీ కీలో 38వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ నంబర్ 3 అని ఇచ్చిన కమిషన్, ఫైనల్ కీలో దాన్ని ఆప్షన్ నంబర్ 2గా మార్చింది. 59వ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ నంబర్ 1 అని ప్రిలిమినరీలో కీలో ఇవ్వగా, ఫైనల్ కీలో ఆప్షన్ నంబర్ 3 సరైన సమాధానం అని ప్రకటించింది. ఇదే ఫైనల్ కీ అని, ఇకపై ఎలాంటి మార్పులకు తావులేదని కమిషన్ స్పష్టం చేసింది.