గ్రూప్-1 అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే

గ్రూప్-1 అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే

గతంలో జరిగిన కొన్ని తప్పిదాల దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అయితే.. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ మూసివేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు స్పష్టం చేసింది.

* ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని స్పష్టం చేసింది. ఇంకా ఓఎంఆర్ షీట్ ను నింపే విషయంలో చాలా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

* ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో ఏమైనా మిస్టేక్ చేస్తే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలని కమిషన్ సూచించింది.

* ఇంకా పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్లతో బబ్లింగ్ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్లు చెల్లవని స్పష్టం చేసింది. డబుల్ బబ్లింగ్ చేస్తే కూడా అంగీకరించేది లేదని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

* అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి ఫొటోలతో కూడిన ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులను తీసుకురావాలని అధికారులు సూచించారు.

* ఎగ్జామ్ సెంటర్ లో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని తెలిపారు.