
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ లను రద్దు చేసిన టీఎస్పీ ఎస్ సీ పలు ఎగ్జామ్ లను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తేదీలను ప్రకటించలేదు. ఒక్క గ్రూప్ 1 ను జూన్ 11న నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. లేటెస్ట్ మరో ఎగ్జామ్ ను వాయిదా వేస్తున్నట్లు టీఎస్ పీఎస్ సీ తెలిపింది. ఏప్రిల్ 4 వ తేదిన జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను TSPSC వాయిదా వేసింది. జూన్17 వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
పేపర్ లీకేజ్ చాలా నియామక పరీక్షలపై పడింది. అన్ని ఎగ్జామ్ రీ షెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రద్దయిన, వాయిదా పడిన ఎగ్జామ్ లతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.