TSPSC : పనిచేయని టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు

TSPSC : పనిచేయని టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు

అభ్యర్థుల సహాయం కోసం ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు. దీంతో గ్రూప్ – 1 అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం టీఎస్పీఎస్సీ మూడు ఫోన్ నంబర్లు ఇచ్చింది. 040 – 22445566, 040 – 23542187, 040 – 23542185 నంబర్లకు మూడు రోజులుగా ఫోన్ చేసినా లాభం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఓ నెంబర్ కు చేస్తే వెల్ కమ్ టూ టీఎస్పీఎస్సీ అని కట్ అవుతోందని.. మరో నెంబర్కు చేస్తే బిజీ వస్తోందని అభ్యర్థులు తెలిపారు. ఇంకో నెంబర్కు ఫోన్ చేస్తే  టెక్నికల్ టీమ్ ఆన్సర్ చేస్తోందని అభ్యర్థుల సందేహాల గురించి తమకు తెలియదని కాల్ కట్ చేస్తున్నారని చెప్పారు. 

గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలపై అనుమానాలు

గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కట్ ఆఫ్ ఎంత అనేది చెప్పడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. కొందరికి 70 మార్కులు వచ్చిన ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేదన్నారు. మహిళా రిజర్వేషన్ లో కటాఫ్ ఎంతన్నది అర్థం కావడం లేదని వాపోతున్నారు. అభ్యర్థులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా టీఎస్పీఎస్పీ అధికారులు మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.