పేపర్ లీకేజీ కేసు : ప్రవీణ్ కు తెలియకుండానే రేణుక పేపర్ డీల్

పేపర్ లీకేజీ కేసు :   ప్రవీణ్ కు తెలియకుండానే రేణుక పేపర్ డీల్

పేపర్ లీకేజీ కేసులో  సిట్ విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరెస్ట్ అయిన తొమ్మది మంది నిందుతులను  సిట్ రెండవ రోజు 7 గంటలపాటు విచారించింది. ఈ విచారణలో నిందితుల నుండి పలు కీలక విషయాలను సిట్ రాబట్టినట్టుగా తెలుస్తోంది. కాసేపట్లోనే హిమాయత్ నగర్ సిట్ కార్యలయం నుంచి సిసిఎస్ కు నిందితులను తరలించనున్నారు. రాజశేఖర్, ప్రవీణ్ ,రేణుక, డాకీయాల వ్యవహారంపై  దర్యాప్తు చేశారు సిట్ అధికారులు. పేపర్ చేతులు మారిన రాజేశ్వర్, రాజేందర్ల నుంచి అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారు.

పేపర్లు ప్రవీణ్ నుంచి రేణుకకు చేరిన తరువాత రాజేశ్వర్, రాజేందర్ కు ఇచ్చిన అంశంలో రేణుకను ప్రశ్నించింది సిట్., ప్రవీణ్ కు తెలియకుండా ఇతరులకు పేపర్ ను ఇవ్వడానికి రేణుక డీల్ కుదుర్చుకున్నట్టుగా అధికారులు గుర్తించారు. పేపర్ మరికొంత మందికి  ఇవ్వడానికి రేణుక ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. మొత్తం ఎన్ని పేపర్స్ అమ్మకానికి ప్లాన్ చేశారనే  కోణంలో ఇవాళ అధికారులు విచారణ చేశారు. ఈ కేసులో నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఆరు రోజుల కస్టడీకి మాత్రమే నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. నిందితులను ఈనెల 23 వరకు విచారణ చేయనున్నారు.