TSPSC: నాంపల్లి కోర్టుకు పేపర్ లీక్ నిందితులు

TSPSC: నాంపల్లి కోర్టుకు పేపర్ లీక్ నిందితులు

టీఎస్ పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు.   ఈ కేసులో ప్రవీణ్ తో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఉస్మానియాలో  నిందితులకు వైద్య పరీక్షలు చేసిన  అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు.  అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గ్రూప్ 1 పేపర్ లీక్ అయినట్లు ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని   సిటీ లా అండ్ ఆర్డర్ సీపీ విక్రమ్ సింగ్ చెప్పారు. 

మరో వైపు టీఎస్ పీఎస్సీ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్  రెడ్డి అధ్యక్షతన  భేటీ అయ్యింది.  మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై చర్చిస్తున్నారు.  అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్  లీక్ పై అనుమానాలను పరిశీలిస్తున్నారు.  పేపర్ లీక్ పై ప్రభుత్వం కూడా టీఎస్ పీఎస్ సీ పై సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.