పాకిస్థాన్ కొత్త బెదిరింపు.. సింధు జలాలు లేకుంటే కాల్పుల విరమణకు 'NO' అంటోంది..!!

పాకిస్థాన్ కొత్త బెదిరింపు.. సింధు జలాలు లేకుంటే కాల్పుల విరమణకు 'NO' అంటోంది..!!

రెండు రోజుల కింద జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాక్ నుంచి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే భారత్ మాత్రం వీటిపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు సాగుతోంది. అయితే తాజాగా పాక్ మరోసారి కాల్పుల విరమణపై బెదిరింపుకు దిగుతోంది.

వాస్తవానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత్ పాకిస్థానుకు సింధు జలాలను ఇప్పటికీ నిలిపివేసింది. కాగా రానున్న చర్చల్లో నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు కుదరదని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ డా తాజాగా పేర్కొన్నారు. 1960లో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పహల్గామ్ దాడి తర్వాత రద్దు చేయటంతో పాక్ ఆందోళన చెందుతోంది. అయితే పాక్ తన వైఖరిని మార్చునికి సీమాంతర ఉగ్రవాదానికి సహాయాన్ని నిలిపివేసినట్లు నమ్మదగిన కార్యక్రమాలను ప్రారంభించేంత వరకు ఒప్పందం అమలును హోల్డ్ లో ఉంచాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ALSO READ | 11 మంది సైనికులే చనిపోయారంట.. ఆపరేషన్ సిందూర్పై పాకిస్తాన్ ప్రకటన

నిన్న రాత్రి భారత ప్రధాని ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా దేశ ప్రజలతో మాట్లాడుతూ.. రక్తం, నీరు కలిసి ప్రవహించటం కుదరంటూ తేల్చి చెప్పేశారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ సైతం మిలిటరీ చర్యలు పాకిస్థాన్ పై నిలిపివేసినప్పటికీ సింధు జలాల ఒప్పందం రద్దు విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించిన తర్వాత పాక్ ప్రస్తుతం కొత్త బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ చేసింది. మరో పక్క భారత ప్రభుత్వం జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఆనకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిన విధానం పాకిస్తాన్‌లో భయాలను పెంచుతోంది.

భారతదేశంపై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన మాకు లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ వెల్లడించారు. ఇండియాతో భూమి మీదే కాకుండా గగనతలంలో పోరాడే సామర్థ్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రాంతీయ శాంతికి జమ్మూ కాశ్మీర్ సమస్య ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఒకవేల ఇండియా పాకిస్థానుకు జలాలు వెళ్లకుండా నిరోధించగలిగితే అది ఆ దేశంలో సాగు, తాగు నీటి సమస్యలకు దారితీస్తుందనే ఆందోళనలు మాత్రం ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతూనే ఉన్నాయి.