
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఎమర్జెన్సీ’సినిమా ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అయితే ఇపుడీ ఈ బ్యూటీ హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది.‘బ్లెస్డ్ ది ఈవిల్’అనే చిత్రంలో ఆమె నటించబోతున్నట్టు సమాచారం.
హారర్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి టైలింగ్ పాండ్, న్యూ మీ మూవీస్ ఫేమ్ అనురాగ్ ముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. గాథ తివారీ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. స్కార్లెట్ రోజ్ స్టాలోన్‌తో కలిసి కంగన స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది.
ప్రముఖ యాక్షన్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ కూతురే ఈ స్కార్లెట్ రోజ్. ‘టీన్ వోల్ఫ్’ఫేమ్ టైలర్ పోసే కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ సమ్మర్‌లో న్యూయార్క్‌లో షూటింగ్ మొదలవనున్న ఈ చిత్రాన్ని లయన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంకచోప్రాను నటించమని కంగనా రిక్వెస్ట్ చేసిందట.
అందుకు ప్రియాంక కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం జక్కన్న, మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బ్రేక్ దొరికితే, ఖచ్చితంగా సినిమాలో నటించేందుకు రెడీ అంటూ చెప్పేసిందట. అలాగే, ప్రియాంక ఉండేది న్యూయార్క్ లోనే కాబట్టి ఇంకా ఈజీగా ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వొచ్చు అనే టాక్. ఏమవుతుందో చూడాలి.
కంగనా రనౌత్ నటిస్తూ, తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ (Emergency).2025 జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సుమారు రూ.60కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీతో భారీగా నష్టపోయింది. ప్రస్తుతం
మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హాలీవుడ్లో నటించిన బాలీవుడ్ నటులు:
హాలీవుడ్ మూవీలో నటించనున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒక్కరే కాదు. గతంలో, ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ వరల్డ్ మరియు ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ చిత్రాలలో నటించారు.
అదేవిధంగా, ప్రియాంక చోప్రా జోనాస్ హాలీవుడ్ వెంచర్లలో.. ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ మరియు బేవాచ్, సిటాడెల్ వంటి చిత్రాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, ఓం పురి, అనిల్ కపూర్, టబు మరియు అలీ ఫజల్ వంటి అనేక మంది నటులు హాలీవుడ్ చిత్రాలలో నటించి మెప్పించారు. మరి కంగనా హాలీవుడ్ డెబ్యూతో లెక్కలు మారేనా? లేదా అనేది ఆసక్తిగా మారింది.