
ఐపీఎల్ 2025 రీ షెడ్యూల్ ఆయా జట్లకు బిగ్ షాక్ ఇవ్వనుంది. ఓ వైపు ఐపీఎల్ మళ్ళీ ప్రారంభమవుతుందనే సంతోషం కంటే.. ఫారెన్ ప్లేయర్లు స్వదేశానికి పయనమవ్వడం ఎక్కువ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు దూరం కానున్నారు. ఇదే దారిలో ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా పయనించనున్నారు. మే నెలాఖరులో వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. మే 29 నుంచి జరగబోయే ఈ సిరీస్ కోసం మంగళవారం (మే 13) ఇంగ్లాండ్ వన్డే, టీ20 స్క్వాడ్ ను ప్రకటించారు.
వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), జాకబ్ బెథెల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జోఫ్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్),జెమీ ఓవర్ టన్ (చెన్నై సూపర్ కింగ్స్) , పిల్ సాల్ట్( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఎంపికయ్యారు. వీరు ఐపీఎల్ 2025 లో లీగ్ మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్లే ఆఫ్స్ సమయానికల్లా జాతీయ జట్టు కోసం వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ ప్రయాణించాల్సి ఉంది. దీంతో ఈ స్టార్ ప్లేయర్స్ ను ఆయా ఐపీఎల్ జట్లు ప్లే ఆఫ్స్ కు మిస్ కానుంది.
జోఫ్రా ఆర్చర్, జామీ ఓవర్టన్ కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నా.. ఆ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగాయి. అయితే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ, ముంబై జట్లకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లాండ్ జట్టులో స్థానం దక్కలేదు. అతను ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ మ్యాచ్ లు మే 29 నుండి ప్రారంభమవుతాయి. కానీ అదే రోజున ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కు కెప్టెన్సీ చేయనున్నాడు.
ఐపీఎల్ రీ షెడ్యూల్ సోమవారం (మే 13) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మే 29 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు.. జూన్ 3 న ఫైనల్ జరగనుంది.
వెస్టిండీస్ తో వన్డేలకు ఇంగ్లాండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, బెన్ డకెట్, విల్ జాక్స్, టామ్ హార్ట్లీ, మాథ్యూ పాట్స్, సాకిబ్ మహమూద్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జామీ స్మిత్
వెస్టిండీస్ తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు
హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, బ్రైడాన్ కార్స్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, మాథ్యూ పాట్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ల్యూక్ వుడ్