ఈనెల 19న రాష్ట్ర బంద్

ఈనెల 19న రాష్ట్ర బంద్

రాష్ట్రంలో ఆర్టీసీ యూనియన్లు తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. డిమాండ్ల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతంగా కొనసాగించాలని డిసైడయ్యాయి. ఇవాళ హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో TSRTC ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో.. యూనియన్ నాయకులు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అక్టోబర్ 13 నుంచి.. 18 వరకు పలు రకాలుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని… ఈనెల 19న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఆర్టీసీ యూనియన్ నాయకులు ప్రకటించారు.

ఆర్టీసీ నిరసన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 13న వంటావార్పు

అక్టోబర్ 14న డిపోల ముందు బైఠాయింపు/కార్మిక సంఘాల సభలు

అక్టోబర్ 15న రాస్తారోకోలు /మానవహారాలు

అక్టోబర్ 16న విద్యార్థి సంఘాలతో ర్యాలీలు

అక్టోబర్ 17న ధూంధాం

అక్టోబర్ 18న బైక్ ర్యాలీలు / బంద్ ప్రచారం

అక్టోబర్ 19న రాష్ట్ర బంద్