మహారాష్ట్రకు తెలంగాణ బస్సు సర్వీసుల కోత

మహారాష్ట్రకు తెలంగాణ బస్సు సర్వీసుల కోత

తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుండి మహారాష్ట్ర కు నడుస్తున్న బస్సు సర్వీసుల్లో కోత పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుతున్న నేపధ్యంలో సెకండ్ వేవ్ అలర్ట్ తో తెలంగాణ ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. సాధారణ ప్రయాణికులు ఎలాంటి భయాందోళనలు లేకుండా తిరుగుతున్న నేపథ్యంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్కులు ధరించి ప్రయాణించడమే కాదు.. బస్సు ఎక్కేటప్పుడే శానిటైజర్ ఇస్తున్నారు. బస్సుల్లో రద్దీని నివారించడానికి సగం శాతం ప్రయాణికులతోనే బస్సులను నడుపుతున్నారు. నాందేడ్ ప్రాంతంలో లాక్ డౌన్ విధించడంతో అటువైపు ఖిలావత్ రూట్లలో బస్సు సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. మంచిర్యాల జిల్లా నుండి చంద్రాపూర్, నాగపూర్ ప్రాంతాలకు నడుస్తున్న బస్సుల్లో ప్రయాణికులను 50 శాతం మాత్రమే ఎక్కించుకుంటున్నారు. బస్సుల్లో ఆక్యుపెన్సీని 50 శాతం మాత్రమే ఉండేలా మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని టీఎస్ ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత వరకు లాక్ డౌన్ ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపకుండా నిలిపేశారు.