ఆర్టీసీ కార్మికుల బాండ్ల పైసలు చెల్లించాలి : టీఎస్​ఆర్టీసీ

ఆర్టీసీ కార్మికుల బాండ్ల పైసలు చెల్లించాలి : టీఎస్​ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన 50 శాతం బకాయిలను వెంటనే చెల్లించాలని టీఎస్​ఆర్టీసీ స్టాఫ్​అండ్​వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్​చేసింది. 5 సంవత్సరాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పి గతంలో 8.75 శాతం వడ్డీతో బాండ్లు ఇచ్చారని, 2020తో గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని తెలిపింది.

సీఎం రేవంత్​రెడ్డి బాండ్ల పైసలకు సంబంధించి రూ.281 కోట్ల చెక్ ఇచ్చి నెలరోజులు దాటినా, ఇంతవరకు డబ్బు జమ చేయలేదని యూనియన్​ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి, సెక్రటరీ జనరల్​హన్మంత్​ముదిరాజ్, అబ్రహం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల్లో చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.