ఫ్రీ బస్ జర్నీకి పాన్​కార్డు చెల్లదు

ఫ్రీ బస్ జర్నీకి పాన్​కార్డు చెల్లదు
  • పాన్ కార్డులో అడ్రస్ లేకపోవడమే కారణం 
  • ఒరిజినల్ ఐడీ లేకుంటే టికెట్ మస్ట్
  • స్మార్ట్ ఫోన్లలో ఫొటో కాపీలు, కలర్ జిరాక్సులు చూపించొద్దు
  • టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 

హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి పాన్ కార్డు చెల్లుబాటు కాదని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది చెల్లదని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఒరిజినల్ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు.

స్మార్ట్ ఫోన్లలో, ఫొటో కాపీలు, కలర్ జిరాక్సులు చూపిస్తే చెల్లవని పేర్కొన్నారు. ఒరిజినల్‌ ఐడీ లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందన్నారు.

‘ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్‌ ఎందుకు తీసుకోవడం’ అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నరు. ఇది సరికాదు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును టీఎస్​ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది. ప్రతి మహిళా కూడా జీరో టికెట్‌ను తీసుకోవాలి’ అని సజ్జనార్​ సూచించారు.