డ్రైవింగ్ స్కూళ్లు స్టార్ట్ చేస్తున్న ఆర్టీసీ.. ఫీజు ఎంతంటే..

డ్రైవింగ్ స్కూళ్లు స్టార్ట్ చేస్తున్న ఆర్టీసీ.. ఫీజు ఎంతంటే..

ట్రైనింగ్‌‌కు రిజిస్ట్రేషన్లు మొదలు

30 రోజుల శిక్షణకు రూ.15,500 ఫీజు

నాన్ టికెట్ ఇన్‌‌కమ్‌‌పై మేనేజ్‌‌మెంట్‌‌ నజర్‌‌

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో డ్రైవింగ్‌‌ స్కూళ్లు రెడీ అయ్యాయి. ట్రైనింగ్ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు స్టార్ట్‌‌ అయ్యాయి. ప్రస్తుతానికి హెవీ వెహికల్‌‌ డ్రైవింగ్‌‌కు ట్రైనింగ్‌‌ ఇవ్వనున్నారు. మరికొద్ది రోజుల్లో లైట్‌‌ మోటార్ వెహికల్స్‌‌కు కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీలో టికెట్‌‌పై ఆదాయం లేకపోవడంతో నాన్ టికెట్ ఇన్‌‌కమ్‌‌పై మేనేజ్ మెంట్ దృష్టి పెట్టింది.

స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌ ద్వారా..

ప్రస్తుతం హైదరాబాద్ లో రెండు, వరంగల్‌‌లో ఒక ఆర్టీసీ స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పథకాల కింద ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్టాఫ్ ఉన్నారు. ఆర్టీసీ సమ్మె తర్వాతి నుంచి వీరికి పెద్దగా పని ఉండటంలేదు. స్థలం కూడా వృథాగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వీటిని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ భావించింది. స్కిల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌ ద్వారా ఓపెన్‌‌గా బయటి వాళ్లకు కూడా డ్రైవింగ్‌‌లో శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

ఫస్ట్ హెవీ వెహికల్స్‌‌కు..

30 రోజులపాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కస్టమర్‌‌ టైమింగ్‌‌ వెసులుబాటు బట్టి డ్రైవింగ్‌‌లో ట్రైనింగ్‌‌ ఇస్తారు.  ఇందుకు ఫీజు రూ.15,500గా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫస్ట్‌‌ థియరీ క్లాసులు, తర్వాత ఫీల్డ్‌‌పై రెండు గంటలు ట్రైనింగ్‌‌ ఇస్తారు. ఇందుకు 3 బస్సులను రెడీ చేశారు. బస్సులో రెండు వైపులా స్టీరింగ్‌‌లు ఏర్పాటు చేశారు. ట్రైనింగ్‌‌కు ఐదుగురు ఇన్‌‌స్ట్రక్టర్లను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతానికి హెవీ వెహికల్‌‌ డ్రైవింగ్‌‌కు రిజిస్ట్రేషన్లు తీసుకుంటున్నారు. త్వరలోనే లైట్‌‌ వెహికల్స్‌‌కు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆర్టీసీ అంటేనే సురక్షితం అనే మంచి పేరుందని, దీంతో మంచి రెస్పాన్స్ వస్తుందని, వుమెన్స్‌‌ నుంచి ఎక్కువ రెస్పాన్స్‌‌ ఉంటుందని భావిస్తున్నామన్నారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికెట్‌‌ ఇస్తామన్నారు.

50 కోట్ల ఆదాయ అంచనా

ప్రస్తుతం గ్రేటర్, ఇంటర్ స్టేట్ బస్సులు మినహా జిల్లాల్లో మాత్రమే బస్సులు నడుపుతున్నారు. కరోనా భయంతో 30 శాతం ఆక్యుపెన్సీ కూడా రావడంలేదు. డ్రైవింగ్‌‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఏటా 50 కోట్ల ఆదాయం అంచనా వేస్తున్నారు.

7న ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు!

ఆర్టీసీలో ఉద్యోగులకు ఈ నెల 7న జీతాలు చెల్లించనున్నట్లు తెలిసింది. లేదంటే 8వ తేదీన ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనాతో ఆదాయం లేకపోవడం వల్ల జీతాలు చెల్లించడం ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. సంస్థలో ఒక నెల జీతాలకు రూ.170 కోట్ల వరకు అవసరం కానుంది. సర్కార్‌ సాయం, ఆర్టీసీ దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఈ నెల జీతాలకు ఇబ్బందులు తప్పాయని అధికారులు అంటున్నారు.

For More News..

ఆర్సీబీ, కేకేఆర్‌ మధ్య ఫస్ట్‌ మ్యాచ్‌!