ఫ్రీ బస్సు ఎఫెక్ట్: సిటీ బస్సుల్లో ఫ్యామిలీ 24, టి6 టికెట్లు నిలిపేసిన ఆర్టీసీ..

 ఫ్రీ బస్సు ఎఫెక్ట్:  సిటీ బస్సుల్లో ఫ్యామిలీ 24, టి6 టికెట్లు నిలిపేసిన ఆర్టీసీ..

హైదరాబాద్:  మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో నగరంలో తిరిగే సిటీ బస్సుల్లో ఫ్యామిలీ 24, టి6 టికెట్లను  టీఎస్ఆర్టీసీ నిలిపేసింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగడంతో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ఫ్యామిలీ 24, టి6 టికెట్లను నిలిపేస్తున్నట్లు ప్రయాణికులకు తెలియజేశారు.   జనవరి 1, 2024 నుంచి ఈ టికెట్లను  పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

"ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో  ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు"  సజ్జనార్ వివరించారు.