పల్లె వెలుగు బస్సుల్లోనూ టీ9 టికెట్​

పల్లె వెలుగు బస్సుల్లోనూ టీ9 టికెట్​

హైదరాబాద్, వెలుగు:  పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ (డైలీపాస్​)ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. రూరల్, సిటీ  ప్రయాణికుల సౌకర్యార్థం ‘టి-9 టికెట్’ ప్రవేశపెట్టింది. శుక్రవారం బస్ భవన్ లో  ‘టి-9 టికెట్’ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్,  అధికారులు లాంచ్​ చేశారు.

ఆదివారం నుంచి ఈ టికెట్ అమల్లోకి రానుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుందని సజ్జనార్ తెలిపారు.  ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానుపోను ప్రయాణం చేయొచ్చన్నారు. ‘టి-9 టికెట్’ ధర రూ.100గా నిర్ణయించారు.  సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి  టికెట్ పొందవచ్చని,  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారని వివరించారు.