TSTET-2023 : అలెర్ట్‌.. టెట్ కీ విడుదల

TSTET-2023 : అలెర్ట్‌..   టెట్ కీ విడుదల

 తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రిలిమినరీ కీ రిలీజైంది. పేపర్‌-1, 2 కీలను 2023 సెప్టె్ంబర్ 20న  అధికారులు రిలీజ్ చేశారు.   సెప్టె్ంబర్ 23 వరకు అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని తెలిపారు.  tstet.cgg.gov.in లో ప్రాథమిక కీని అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

.రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌రు 15న‌ జరిగిన టెట్‌ పేపర్‌-1కు  2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది(84.12 శాతం) పరీక్ష రాశారు. బీఈడీ విద్యార్థులకే అర్హత ఉన్న పేపర్‌-2కు  2,08,498మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 91.11 శాతం మంది హాజరైన విషయం తెలిసిందే.  

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష జరుగగా.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్‌-2 రాతపరీక్ష నిర్వహించింది.  టెట్‌ ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి.