
టీటీడీ బోర్డు మీటింగ్ లో హై డ్రామా కొనసాగుతోంది. సమావేశం మొదలవ్వగానే కొద్దిసేపటికే ఈవో, జేఈవోలు… బయటకు వచ్చారు. ఆ తర్వాత బోర్డు సభ్యుడు… చల్లా బాబు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. టీడీపీ ఓడిపోవటంతో… నైతిక బాధ్యత వహిస్తు రాజీనామ చేసినట్లు తెలిపారు. మరోవైపు జేఈవో శ్రీనివాసరాజు వల్లే టీటీడీ భ్రష్టుపట్టిందన్నారు చల్లాబాబు. అటు టీటీడీ పాలక మండలి సమావేశాన్ని అధికారులు బహిష్కరించారన్నారు చైర్మన్ సుధాకర్ యాదవ్. బోర్డును ప్రభుత్వం నియమించింది కాబట్టి…వాళ్లు రద్దు చేస్తే తప్ప.. స్వచ్చందంగా పదవులకు రాజీనామా చేయమన్నారు బోర్డు చైర్మన్.