
తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆ వడ్డీకాసుల వాడికి ప్రపంచమంతటా భక్తులే. ఆ భక్తులు తమ మొక్కుబడులను శ్రీవారికి ధన, వస్తు రూపేణా హుండీలో సమర్పిస్తుంటారు. ఆ కానుకల్లో చిల్లర నాణేలు భారీగా పేరుకుపోయాయి. చిల్లర కుప్ప లతో, టన్నుల, టన్నుల చిల్లర నాణేలతో కామణిలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న టీటీడీ ఇక ఆ సమస్యకు చెక్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంది.
గత కొన్నేళ్లుగా టిటిడి కి సంబంధించిన ఆదాయాన్ని పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అయినప్పటికీ చిల్లర నాణేలు సేకరణకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీటీడీ పరకామణి నుంచి చిల్లర నాణేలు సేకరించిన బ్యాంక్ కు అంతే మొత్తంలో నగదు డిపాజిట్ చేస్తామని స్పెషల్ ఆఫిసర్ దర్మారెడ్డి తెలిపారు.దీంతో టిటిడి దగ్గర భారీగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన నాణేలు సేకరణకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ తాజా నిర్ణయంతో టీటీడీకి ఆదాయం పెరగనుంది.