తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల ట్రయిల్ రన్

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల ట్రయిల్ రన్

తిరుపతి: పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని ఎలక్ర్టిక్ బస్సులను తిరుమలలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మూడు రోజులపాటు ఎలక్ట్రిక్ బస్సుల ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నారు. తిరుమలకు వచ్చిన ఎలక్ట్రిక్ బస్సును టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. అధికారులతో కలసి  తన కార్యాలయం నుండి అన్నమయ్య భవన్ వరకు ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు.  ఈ బస్సు ఒకసారి చార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.  ప్రభుత్వం, ఆర్టీసి తో చర్చించి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని  టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. పర్యావరణ రక్షణ లో భాగంగా ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధించామని గుర్తు చేసిన ఆయన కాంక్రీటు కట్టడాలు కూడా తగ్గించడం జరిగిందని వివరించారు. కర్ణాటక కి చెందిన మేడ్ ఇన్ ఇండియా కంపెనీ వీర వాహన కంపెనీ వారు తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతున్నామని తెలిపారు.