తిరుమలలో టిటిడి ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ

తిరుమలలో టిటిడి ఎలక్ట్రిక్‌ బస్సు చోరీ

తిరుమల శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్  బస్సు ను చోరీకి గురైంది. తిరుమలలో భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా తరలించే టిటిడిఎలక్ట్రిక్‌ బస్సును దుండగులు దొంగిలించారు. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 4 గంటలకు బస్సు చోరికి గురైనట్లు సమాచారం. చోరికి గురైన ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు రూ. 2 కోట్లు ఉంటుంది. 

GPS ఆధారంగా బస్సు కదలికలని పసిగట్టిన పోలీసులు.. తిరుమల నుంచి తిరుపతికి .. అక్కడి నుంచి నెల్లూరు వైపునకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. తిరుమల క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో GPS సిస్టమ్‌ ద్వారా బస్సును.. నాయుడుపేట, గూడూరు మధ్యలో ఉన్నట్లు గుర్తించారు.  నాయుడుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి పోలీసులు బస్సును పట్టుకున్నారు.  ఛార్జింగ్ అయిపోవడంతో..నిందితుడు బస్సును రోడ్డుపైనే వదిలిపారిపోయినట్లు పోలీసులు తెలిపారు. 

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్నారు మలయప్పస్వామి. మాఢ వీధుల్లో భక్తులు శ్రీనివాసుడికి మంగళ హారుతులు ఇస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల గోవింద నామస్మరణ, కళాకారుల ఆటపాటలతో బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు బంగారు గొడుగు ఉత్సవం... రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలో స్వామివారు దర్శమివ్వన్నారు.