TTD పాలకమండలి కీలక నిర్ణయాలు

TTD పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలక మండలి సమావేశం ముగిసింది. TTD ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2019-20 వార్షిక రివైజ్డ్ బడ్జెట్ రూ. 3,243 కోట్లుకు ఆమోదం తెలిపింది.

TTD పాలకమండలి నిర్ణయాలు:

..TTD ప్రధాన అర్చకులుగా రమణ దీక్షతుల నియామకం

..బర్డ్ ఆస్పత్రి డైరెక్టర్ గా మదన్ మోహన్ రెడ్డి నియామకం

..వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

..జమ్ముకశ్మీర్,వారణాసిలో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణం

..సంక్రాంతి తర్వాత తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ నిషేధం

..సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు TTD ఆమోదం

..శ్రీవరహస్వామి ఆలయంలో గోపురం బంగారు తాపడానికి రూ.14కోట్లు కేటాయింపు

..పరిపాలన భవనం మరమ్మతులకు రూ.14.5 కోట్లు

.. రూ.8 కోట్లతో రెండు ఘాట్‌ రోడ్డుల మరమ్మతులకు అనుమతులు

.. రూ.30 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పాలకమండలి ఆమోదం

.. రూ.10 కోట్లతో రెండో ఘాట్‌రోడ్డులో క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు

..రూ.3.4 కోట్లతో తిరుపతిలోని కళ్యాణమండపాలకు ఏసీ ఏర్పాటు

..లడ్డూ ప్రసాదాలపై టీటీడీ ఏటా రూ.200 కోట్లు సబ్సిడీ