
తిరుమల ఘాట్ రోడ్డులో ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను సడలిస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ్టి ( సెప్టెంబర్ 29) నుంచి ఘాట్ రోడ్డులో రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపింది. ఘాట్‌రోడ్డులో చిరుతల కదలికలు తగ్గడంతో ఆంక్షలు సడలించినట్లు పేర్కొంది. తిరుమల ఘాట్‌రోడ్డులో చిరుతల సంచారం నేపథ్యంలో ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించారు. తాజాగా ఆంక్షలు సడలించడంతో రాత్రి 10 గంటల వరకు బైక్‌లను అనుమతించనున్నారు. ఘాట్‌రోడ్డులో జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించింది.
ALSO READ: తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం