ఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది

ఇగ తిరుపతిలో ఎక్కువ లడ్డూలు తీస్కునుడు కుద్రది

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకతంగా ఉండేందుకు వీలుగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఫేస్ రికగ్నైజేషన్  టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి ఈ నూతన విధాన అమలును పరిశీలిస్తోంది. గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ప్రస్తుతం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అందుకోసం ఆధునికి టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఒకే వ్యక్తి ఎక్కువ గదులు తీసుకోవడానికి వీలుండదు. ఈ విధానం వల్ల  పారదర్శకంగా భక్తలకు సేవలు అందించవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం లోటు పాట్లను పరిగణలోకి తీసుకుని, పూర్తి స్థాయిలో అమలు చేస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.