బైపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అధికార పార్టీలదే హవా..తమిళనాడులో టీవీకే డబుల్ ధమాకా

బైపోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో అధికార పార్టీలదే హవా..తమిళనాడులో టీవీకే డబుల్ ధమాకా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 స్థానాలకు  జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా కొనసాగింది.  ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు (పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు, తమిళనాడులో రెండు, పుదుచ్చేరిలో ఒకటి), అస్సాంలోని ఒక లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ స్థానానికి నిర్వహించిన బై పోల్స్ ఓట్ల కౌంటింగ్.. శుక్రవారం ఉదయం ప్రారంభమై రాత్రి వరకు కంటిన్యూ అయ్యింది. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)  దూకుడు పెంచింది. ఆ రాష్ట్రంలో జరిగిన రెండు స్థానాలనూ కైవసం చేసుకుంది. మధురాంతంకంలో 20,040 ఓట్ల మెజార్టీతో టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘన విజయం సాధించారు. 

ధారాపురంలో 9,471 ఓట్లతో పి.సత్యభామ గెలుపొందారు. తొలుత ఈ రెండు సెగ్మెంటల్లోనూ కౌంటింగ్ సమయంలో ఉత్కంఠ నెలకొంది. చివరకు టీవీకే అభ్యర్థులే గెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయ్ ఫొటోలు, టీవీకే జెండాలతో నినాదాలు చేస్తూ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కాగా.. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి గెలిచి.. ఆ తర్వాత టీవీకేలో చేరిన ఈ మహిళా నేతలు తాజా ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించడం విశేషం. ఇక డీఎంకే  సెకండ్​ప్లేసులో నిలవగా అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది.

నందిగ్రామ్​లో రికార్డు విజయం

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ జోరు కొనసాగింది. రెజినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నందిగ్రామ్​ రెండింటినీ గెలుచుకుంది. నందిగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హసిరానీ రత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్​ అభ్యర్థి మిలాన్​ ప్రధాన్​ను రికార్టు స్థాయిలో 1,22,753 ఓట్లతో ఓడించారు. పుదుచ్చేరిలో సీఎం ఎన్​రంగస్వామి పార్టీ తట్టంచావడి అసెంబ్లీ సీటును కైవసం చేసుకుంది. వీటితోపాటు అస్సాంలోని నాగావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ 1,42,224 ఓట్ల మెజార్టీతో గెలిచింది.

రాజ్యసభకు 10 మంది ఏకగ్రీవం

లక్నో: ఉత్తరప్రదేశ్​లో రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బరిలో నిలిచిన 10 మంది అభ్యర్థులు పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు శుక్రవారం రిటర్నింగ్ ఆఫీసర్, యూపీ విధాన సభ స్పెషల్ సెక్రటరీ అజిత్ వర్మ అధికారికంగా ప్రకటించారు. వీరిలో 8 మంది బీజేపీ, ఇద్దరు సమాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఎస్పీ అభ్యర్థి ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజ్ పరిమళ్ నత్వాని మినహా మిగతా  క్యాండిడేట్లలందరూ తమ ధ్రువపత్రాలను (సర్టిఫికెట్లు) అందుకున్నారు. ఎస్పీ నేత రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గోపాల్ యాదవ్, బీజేపీ అభ్యర్థి రాధాకాంత్ ఓజా తరఫున వారి ప్రతినిధులు సర్టిఫికెట్లను స్వీకరించారు.