జేవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టుకు మోదీ పేరు! : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

జేవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టుకు మోదీ పేరు! : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జేవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘నరేంద్ర మోదీ అంతర్జాతీయ విమానాశ్రయం, నోయిడా- జేవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా పేరు ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం లక్నోలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ విషయాన్ని వెల్లడించారు. జేవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృతజ్ఞతలు తెలిపిందన్నారు. 

విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టే ప్రతిపాదనను ఆమోదించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం యూపీలోనే అతిపెద్ద విమానాశ్రయంగా, దేశంలోనే ప్రధాన ఏవియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. రూ.11,282 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయం తొలి దశ నిర్మాణం చేపట్టారు.