అంబర్ పేట్ ఎస్సై కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికొస్తున్నాయి. పర్సనల్ రివాల్వర్ మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ క్రైమ్ కేసులో 2025 జనవరిలో బంగారం రికవరీ చేసిన ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి.. రికవరీ చూయించకుండా అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే బంగారంతో పాటు తుపాకిని సైతం డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఆర్థిక ఇబ్బందులతో పర్సనల్ రివాల్వర్ అమ్మేసుకున్నాడని ఆరోపణలున్నాయి.
డిటెక్టివ్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అంబర్పేట్ పోలీసులు .. రివాల్వర్ మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విచారణ లో భాగంగా రివాల్వర్ ను తీసుకురావాల్సిందిగా సూచించారు అధికారులు. దీంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు ఈస్ట్ జోన్ పోలీసులు.
యాప్ లో క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అప్పుల భారం పెరగటంతో వేరే కేసులో రికవరీ అయిన బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం రివాల్వర్ మిస్సింగ్ పై ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్థిక కారణాలవల్ల భాను ప్రకాష్ రివాల్వర్ అమ్ముకొని ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
