డాక్టర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. బంధువే ప్రధాన నిందితుడు

డాక్టర్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. బంధువే ప్రధాన నిందితుడు

హైదరాబాద్: రాజేంద్రనగర్ లో డెంటిస్టు డాక్టర్ హుసేన్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. బంధువు ముస్తాఫానే కిడ్నాప్ చేయించినట్లు తేల్చిన పోలీసులు.. డాక్టర్ హుస్సేన్ అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని తెలుసుకున్న బంధువు ముస్తఫా కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయింది. డాక్టర్ హుస్సేన్ ఇంటి పైన అద్దెకి ఉంటున్న ఖలీద్ అనే వ్యక్తి ద్వారా కిడ్నాప్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ముస్తఫా డాక్టర్ వద్ద డబ్బు ఉండడం గమనించి కిడ్నాప్ కు  ప్లాన్ చేశాడు. డాక్టర్ కుటుంబం నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేశాడు.

కిడ్నాప్ చేసేందుకు కొంత మందిని మాట్లాడుకొని ప్లాన్ చేసుకున్నారు. నిన్న సాయంత్రం డాక్టర్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు వాట్సాప్ కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు కూడా బిట్ కాయిన్ రూపంలో కావాలని షరతు విధించారు.

డాక్టర్ హుసేన్ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో.. వాట్సప్ నెంబర్ పై నిఘా పెట్టారు. ఆ నెంబర్ ఆధారంగా వెహికిల్ ని ట్రేస్ చేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు  సైబరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసుల సూచనల మేరకు వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు కిడ్నాప్ గ్యాంగ్ వెళ్తున్న వెహికల్ మార్గంలో అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీ చేయడం గమనించిన కిడ్నాపర్లు తనిఖీల నుండి తప్పించుకునేందుకు విఫలయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు తెల్లవారుజామున అనంతపురం  జిల్లా రాప్తాడు సమీపంలో కిడ్నాపర్ల వెహికల్ ను గుర్తించి అడ్డుకున్నారు. పోలీసులు ఆపిన విషయం గమనించిన కిడ్నాపర్లలో ఇద్దరు పరార్ కాగా.. మరో ఇద్దరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ముసుగుతో చేతులు బంధించి ఉన్న డాక్టర్ హుస్సేన్ ని సురక్షితంగా కాపాడారు. వెంటనే హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో డాక్టర్ హుసేన్ బంధువు ముస్తఫా, ఖలీద్ బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ చేసేవారు. అందుకే వాళ్లు ఆ రూపంలో డబ్బులు అడిగారు. కిడ్నాపర్లకు కర్ణాటకలో హోటల్ బిజినెస్ ఉంది. అక్కడ పరిచయం ఉన్న వ్యక్తలతోనే కిడ్నాప్ చేసేందుకు ముఠాను రెడీ చేసుకున్నారు. మూడు నెలల నుంచే కిడ్నాప్ కు ప్లాన్ చేసి.. నిన్న సాయంత్రం కిడ్నాప్ కు పాల్పడ్డారు.

for more details..(video)