సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్...

సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్...

విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసుపై శరవేగంగా విచారణ చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు సతీష్ అనే వడ్డెర యువకుడ్ని A1గా, దుర్గారావు అనే మరో వ్యక్తిని A2గా రిమాండ్ రిపోర్ట్ లో చేర్చారు. కోర్ట్ ఆదేశాలతో సతీష్ ని నెల్లూరు జిల్లా జైలుకు రిమాండ్ కి తరలించిన పోలీసులు దుర్గారావును విచారిస్తున్నారు. దుర్గారావుకు టీడీపీ ఆఫీసులో ఉద్యోగి కావటంతో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది.

ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దురాగారావును విచారించిన పోలీసులు, ఈ కేసుతో అతనికి సంబంధం లేదని నిర్దారణకు వచ్చి శనివారం రాత్రి సమయంలో అతన్ని ఇంటి వద్ద వదిలేసి వెళ్లారు. దుర్గారావును కేవలం విచారణ కోసమే తీసుకెళ్లామని, ఈ ఘటనతో అతనికి సంబంధం లేదని విచారణలో తేలటంతో విడుదల చేశామని క్లారిటీ ఇచ్చారు. దురాగరోను కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి మళ్లీ అవసరమైతే విచారణకు తీసుకెళ్తామని తెలిపారు.