మహారాష్ట్రలో వరసగా రెండు భూకంపాలు..

మహారాష్ట్రలో వరసగా రెండు భూకంపాలు..

మహారాష్ట్రలోని హింగోలి నగరంలో రెండుసార్లు భూమి కంపించింది. గురువారం ఉదయం 6 గంటల 8 నిమిషాల ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 4.5 గా నమోదయ్యింది. ఈ భూకంప తీవ్రత 10కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత 6 గంటల 19 నిమిషాల ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. రెండోసారి వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 3.5గా, 10 కిలోమీటర్ల డెప్త్ గా నమోదయ్యింది.

 

అదృష్ట వశాత్తు ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్థి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని అధికారులు ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్ ద్వారా తెలిపారు.ఉదయాన్నే భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. మొత్తానికి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం ఏమీ సంభవించకపోవటంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.