ఎటు పోతుంది ఈ సమాజం : బైక్ రైడింగ్ లో ఇద్దరబ్బాయిల లవ్ స్టోరీ

ఎటు పోతుంది ఈ సమాజం : బైక్ రైడింగ్ లో ఇద్దరబ్బాయిల లవ్ స్టోరీ

ఇప్పటి వరకు అబ్బాయి.. అమ్మాయి లిప్ లాక్ వంటి ఘటనలు చూశాం.. మొన్నీ మధ్య ఇద్దరమ్మాయిలు బైక్ పై ముద్దులు పెట్టుకున్న వీడియో హల్చల్ చేయగా.. ఇప్పుడు అలాంటి వీడియో మరొకటి వైరల్ అయింది. అయితే ఈ సారి ఇద్దరబ్బాయిలు రన్నింగ్ బైక్పై ముద్దులు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  

 బహిరంగంగా రొమాన్స్

ఇటీవల ఎక్కువగా ప్రేమికులు బహిరంగంగా రొమాన్స్ చేస్తున్నారు. రన్నింగ్ బైక్‌పై ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటి వరకు అమ్మాయి- ..అబ్బాయి మధ్య మాత్రమే జరిగాయి. అయితే విచిత్రంగా ఇద్దరు అబ్బాయిలు రన్నింగ్‌లో ఉన్న స్కూటీపై ముద్దులు పెట్టుకున్నారు. యూపీలోని రాంపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

బరితెగించిన యువకులు

ఓ ఇద్దరు యువకులు బరితెగించారు.  రన్నింగ్ బైకుపై ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ జుగుత్సాకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్లో  వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బోయ్ఫ్రెండ్స్  బైక్‌పై వెళ్తూ బ‌రితెగించి మ‌రీ రొమాన్స్ చేశారు.  

వీడియో వైరల్‌

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై ముద్దుపెట్టుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇది బైక్‌పై ఉన్న ఇద్దరు అబ్బాయిలు  రన్నింగ్ బైక్ పై బహిరంగంగా లిప్‌లాక్‌ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ వీడియోలో ఒక అబ్బాయి వెనుక వైపుకు తిరిగి మరొకరిని ముద్దు పెట్టుకున్నాడు.

పోలీసుల స్పందన

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోను గమనించిన రాంపూర్ పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ రకమైన చర్యకు పాల్పడిన వారిని గుర్తించాలని పోలీస్ ఉన్నతాధికారులు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.