టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల హిట్ కాంబినేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ రియల్ లైఫ్‌లో పెళ్లిబంధంతో ఒకటైన తర్వాత రాబోతున్న తొలి పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు అభిమానులకు సరికొత్త సంగీత విందు అందించారు.
సినిమాలోని మొదటి సింగిల్ 'ఏందయ్యా సామీ' ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వీరి వివాహ వేడుక సమయంలొనే ఈ పాటలోని కొంత భాగాన్ని కానుకగా విడుదల చేయగా.. అప్పట్లోనే ఇది సోషల్ మీడియాను ఊపేసింది. ఇప్పుడు విడుదలైన పూర్తి పాట కొత్తగా పెళ్లయిన దంపతుల నడుమ ఉండే చిలిపి అల్లరి, ముద్దుల గొడవలు, బాండింగ్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
అజయ్-అతుల్ అందించిన స్వరాలకు, రామజోగయ్య శాస్త్రి అందించిన అద్భుతమైన సాహిత్యం ప్రాణం పోసింది. శ్వేతా మోహన్, అజయ్ గోగావాలేల గాత్రం, విజయ్-రష్మికల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఈ సాంగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెట్టింట షేక్ చేస్తున్నారు.
1854 నుండి 1878 కాలం నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా, బ్రిటిష్ కాలం నాటి శక్తివంతమైన యోధుడి కథగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో తుఫాను సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ అద్భుతంగా ప్రారంభమవ్వడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమనిపిస్తోంది..
