నర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి మృతి చెందిందంటూ..

నర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి మృతి చెందిందంటూ..

హైదరాబాద్‌: లక్డీకాపూల్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి మృతి పై వివాదం చెలరేగింది. నర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి చనిపోయిందంటూ తల్లిదండ్రులు ఆరోపించడం వివాదం రేపుతోంది. గత ఫిబ్రవరి నెల 28 వ తేదీన చిన్నారిని నాగర్ కర్నూల్ నుంచి నిలోఫర్ ఆస్పత్రికి తీసుకునివచ్చారు. ఈ చిన్నారి 7వ నెలలో ఒక కేజి బరువుతో పుట్టింది. ఇవాళ ఆస్పత్రిలో ఉదయం 6 గంటల సమయంలో ఆ చిన్నారి మృతి చెందింది. నర్స్ చేసిన ఇంజెక్షన్ల వల్లే తమ చిన్నారి మృతి చెందిదంటూ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేయగా వైద్యులు స్పందించారు. బరువు తక్కువ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు లోపల అవయవాల ఎదుగుదల ఉండదని, చిన్నారిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి నప్పటి నుంచి ఆక్సిజన్ మీద ఉంచామన్నారు. చిన్నారి మృతి  బాధలో తల్లిదండ్రులు వైద్యుల నిర్లక్ష్యం వలన తప్పిదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నరని పేర్కొన్నారు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని.. అందువల్లే చనిపోయారని నిలోఫర్ వైద్యులు చెబుతున్నారు.  

 

ఇవి కూడా చదవండి

పెండింగ్ చలాన్ల క్లియర్ కు విశేష స్పందన

ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్